మార్కెట్లో సరిపడ యూరియా అందుబాటులో ఉందని , యూరియా కొరత ఉందని ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని జంగారెడ్డిగూడెం డిఎస్పి యు.రవిచంద్ర హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో ఉన్న ఎరువుల గోడౌన్ ను డిఎస్పి సోమవారం తనిఖీ చేశారు. యూరియా స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిఎస్పి రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ... మార్కెట్లో యూరియా కొరత ఉందని జరుగుతున్న ప్రచారంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. దీంతో గోడౌన్లలో తనిఖీలు చేస్తున్నామన్నారు.