Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: వినాయ‌కుడు చూస్తున్నాడు..ఆశీర్వ‌దిస్తున్నాడు..

India | Aug 28, 2025
విశాఖపట్నంలో వినాయక చవితి సందర్భంగా వినూత్న విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా, రెవెన్యూ కాలనీలోని ఉత్తమ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన 13 అడుగుల వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహం కనురెప్పలు వేస్తున్నట్లు రూపొందించడం విశేషం. నిర్వాహకుల ఈ సృజనాత్మకతకు భక్తులు మంత్రముగ్ధులయ్యారు. బుధవారం విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, గురువారం నగరంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కనురెప్పలు వేసే ఈ వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ వినూత్న విగ్రహం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.
Read More News
T & CPrivacy PolicyContact Us