కాట్రేనికోన మండలం, కొప్పిగుంట కి చెందిన కొప్పిశెట్టి శ్రీనివాసరావు కరెంటు షాక్ కొట్టడంతో మరణించినట్లు కాట్రేనికోన ఎస్సై అవినాష్ వెల్లడించారు. బంధువులు తెలిపిన సమాచారం మేరకు.. బట్టలు ఇస్త్రీ చేస్తుండగా కరెంటక్ షాక్ తగలడంతో చనిపోయినట్లు తెలిపారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.