ఉల్లిపిట్ట గ్రామం నుండి విద్యార్థులు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని DYFI జిల్లా అధ్యక్షులు టికానంద్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి వెళ్లే దారిలో మూడు లోలెవల్ వంతెనలు ఉండడంతో చిన్నపాటి వర్షానికి పొంగి పొర్లుతుంది. దీంతో విద్యార్థులు సామాన్య ప్రజలు వెళ్లలేక ఇక్కట్లు పడుతున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 108 వాహనం కూడా రాలేని పరిస్థితి ఉంటుందన్నారు. హైలెవల్ వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.