చిన్న శంకరంపేట మండలం గవలపల్లిలో యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు బుధవారం ఉదయం 6 గంటల నుండి పడిగాపులు కాశారు మహిళలు తమ చంటి పిల్లలను ఎత్తుకొని వచ్చి వరుసలో నిలబడ్డారు, ఉదయం నుండి ఏమి తినకుండా వచ్చి తమ పిల్లలకు ఎరువుల దుకాణం వద్ద పాలిచ్చి ఆకలి తీర్చిన తల్లుల బాధ వర్ణనాతీతం, ఒకసారిగా రైతులు యూరియా కోసం రావడంతో పోలీసుల పహార మధ్య రైతు వేదికలో యూరియా టోకెన్లను అందజేశారు, ఈ సందర్భంగా మహిళా రైతు లావణ్య మాట్లాడుతూ చంటి పిల్లలతో ఉదయం ఇక్కడికి రావడం జరిగిందని యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకొని వస్తే ఒకరికి ఒక సంచి మాత్రమే ఇవ్వడం జరుగుతుందని అని ఆవేదన వ్యక్తం చేశారు.