ఆదోనిలో ఇసుక అక్రమ రవాణాపై ఇటీవల ఎమ్మెల్యే పార్థసారధి వ్యాఖ్యలపై తనపై వచ్చిన ఆరోపణలకు టీడీపీ నాయకుడు శ్రీకాంత్ చెరుకూరి భీమస్లో నిర్వహించిన ప్రెస్మీట్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులను పక్కన పెట్టుకుని మాట్లాడటం కూటమి పార్టీ విధానానికి వ్యతిరేకమని అన్నారు. సొంత పార్టీపై విమర్శలు చేసి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నారని మండిపడ్డారు. అక్రమ రవాణా బాధ్యులు ఎవరనేది త్వరగా గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.