ప్రకాశం జిల్లాలో భార్యపై అనుమానం పెంచుకొని పథకం ప్రకారం గొడ్డలితో హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. బేస్తవారిపేట మండలం పివిపురం గ్రామంలో ఆగస్టు 22వ తేదీన రామలక్ష్మమ్మ అనే మహిళను ఆమె భర్త పగ్గాల వెంకటేశ్వర్లు తన పొలంలో గొడ్డలితో నరికి హత్య చేశాడు.. కొంతకాలంగా భార్య ప్రవర్తన పై అనుమానం పెంచుకున్న వెంకటేశ్వర్లు పథకం ప్రకారం హత్య చేస్తున్నట్లు మీడియాకు సీఐ మల్లికార్జున వెల్లడించారు. పొలంలో పని ఉందని తీసుకువెళ్లి భార్యను గొడ్డలితో నరికి హత్య చేసినట్లుగా సీఐ సోమవారం తెలిపారు.