తాడ్వాయి మండలంలో 3 రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జంపన్న వాగుకు ఉద్ధృతి పెరగడంతో మేడారం బ్రిడ్జి నుంచి గోవిందరాజుల భవనం వరకు పంట పొలాలు, రోడ్డును వరద నీరు కమ్మేసింది. అప్రమత్తమైన అధికారులు జంపన్న వాగును చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆందోళన చెందిన ప్రజలు నేడు గురువారం ఉదయం 9 గంటలకు వాగు వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు.