దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధన నిర్వహించడం శుభ పరిణామమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వరసిద్ధి వినాయక చవితి మహోత్సవంలో భాగంగా పలు చోట్ల ఏర్పాటు చేసిన అన్న సమారాధనలను శనివారం ఒంటిగంటకు ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. సుంకర పద్దయ్య వీధిలో 34వ వార్షిక మహోత్సవం, శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం, 35వ వార్డు కాస్మో పాలిటిన్ క్లబ్ రోడ్డులో ఏర్పాటు చేసిన అన్న సమారాధనలను ప్రారంభించి మాట్లాడారు.