మలికిపురం మండలం తూర్పుపాలెంలో పట్టపగలే చోరీ జరిగింది. తిరుమణి నాగరాజు ఇంటికి తాళాలు వేసి భార్యా భర్తలు హోటల్కు వెళ్లగా, దుండగులు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువా తాళాలు పగలగొట్టి, అందులో ఉన్న 12 కాసుల బంగారం, రూ. 25 వేల నగదును ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చిన నాగరాజు ఈ ఘటనను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.