అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం పీలేరు మండలం పీలేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో స్త్రీ శక్తి విజయోత్సవ సంబరాలను నిర్వహించగా భారీ ఎత్తున మహిళలు టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 60సం. పైగా తమ కుటుంబం 15సార్లు ఎన్నికల్లో పోటీ చేయగా 9సార్లు విజయం సాధించినట్లు తెలిపారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను ఏడాది కాలంలోనే అమలు చేసినట్లు తెలిపారు