మండపేట పట్టణంలో ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు కొమ్మిశెట్టి సత్తిబాబు కుటుంబానికి రూ.5 లక్షల భీమా చెక్కును జనసేన నాయకురాలు వేగుళ్ళ అనిత అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. పిల్లల చదువుల బాధ్యతను పార్టీ చూస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సభ్యత్వం నమోదు చేయించిన వాలంటీర్ సుంకర మణికంఠ కు అభినందనలు తెలియజేశారు.