Atmakur, Sri Potti Sriramulu Nellore | May 27, 2025
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో సోమశిల జలాశయానికి వరద పెరుగుతుంది. మంగళవారం ఎగువ ప్రాంతాల నుంచి 162 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు ఈఈ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. జలాశయంలో 43.653 టీఎంసీల నీటిమట్టం నమోదయింది. పెన్నా డెల్టాకు 3,000, దక్షణ కాలువకు 50, ఉత్తర కాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 235 క్యూసెక్కుల నీరు అవిరి అవుతుంది.