ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు బుధవారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో అమరావతి మహిళలపై సాక్షి టీవీ ఛానల్ డిబేట్లో చేసిన అనుచిత వ్యాఖ్యలకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కూటమి పార్టీ మహిళలు ప్లకార్డులు నల్ల బెలూన్లతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నిరసన చేస్తున్న మహిళలపై వైసీపీ శ్రేణులు రాళ్లు చెప్పులతో దాడులు చేశారు. ఇదే సమయంలో అక్కడున్న పోలీసులు లాఠీ చార్జి చేసి ఇరువర్గాలను తరిమివేసి గొడవను అదుపు చేశారు..ఈ ఘటనను ఉమ్మడి జిల్లాకు చెందిన టిడిపి నేతలు తీవ్రంగా ఖండించారు.