నగర తూర్పు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అక్రమ సంపాదనకు హద్దు లేకుండా పోయిందని నగర వైసిపి అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం సాయంత్రం నగరంలోని ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూరి ఫాతిమా మాట్లాడారు గుంటూరులో ప్రసిద్ధిగాంచిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దసరా ఉత్సవాలకు కమిటీ మెంబర్ కావాలంటే టిడిపి, జనసేన, బిజెపి సభ్యత్వం కలిగి ఉండాలని, 50 వేల రూపాయలు చెల్లించాలి అంటున్నారని నూరి ఫాతిమా ఆరోపించారు.