వికారాబాద్ జిల్లా దారులు మండల పరిధిలోని మోమిన్ కుర్దు గ్రామంలో ఉన్న అగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద శనివారం యూరియా కోసం రైతులు కిలోమీటర్ల మేర లైన్లో నిలబడ్డారు. ఒకవైపు చిరుజల్లులు కురుస్తున్న అలాగే రైతులు యూరియా కోసం పట్టు విడవని విక్రమార్కుడి వలె లైన్లో నిలబడ్డారు. రెండు యూరియా బస్తాలు దొరుకుతాయి పంట పొలాలకు వేస్తే కాస్త దిగుబడి వస్తుందనిఆశతో రైతులు ఉన్న, అయినా ప్రభుత్వ మాత్రం కనికరించకుండా యూరియా కష్టాలు మాత్రం తీర్చడం లేదని రైతులు వాపోతున్నారు.