గత శుక్రవారం రాత్రి 12 గంటలకు బ్లూ కోల్ట్ సిబ్బంది, కానిస్టేబుల్ సల్మాన్ మరియు హోమ్ గార్డ్ అయూబ్ అనువారలు మోటార్ సైకిల్ పై పెట్రోలింగ్ చేయుచు ఆరెపల్లి దర్గా టర్నింగ్ వద్దకు చేరుకునేసరికి ముగ్గురు వ్యక్తులు ఆరెపల్లికి చెందిన రాకేష్, అచ్యుత్, ప్రవీణ్ సు రోడ్ ప్రక్కన మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారనే సమాచారంతో సంఘటన స్థలానికి వెళ్లిన బ్లూ కోల్ట్ సిబ్బంది పై దాడి చేసి పోలీసుల ట్యాబ్ ని గుంజుకొని తమ విధులకు ఆటంకం కల్గించారని సదరు వ్యక్తు పై బ్లూ కోల్ట్ సిబ్బంది కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా, వారిపై కేసు నమోదు చేశామన్నారు.