నరసరావుపేటలోని అత్యంత రద్దీ ప్రాంతమైన మల్లమ్మ సెంటర్ లోని ఓ బేకరీ మార్ట్లో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి షాపు షట్టర్ పగులగొట్టి లోపలికి ప్రవేశించి రూ. 1.50 లక్షల నగదును దొంగిలించాడు.సోమవారం ఉదయం దుకాణం తెరవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలో దొంగతనం దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. షాపు యజమాని హర్షవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.