ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఎస్పీల బదిలీల ప్రక్రియను నిర్వహించింది ఇందులో భాగంగా 12 జిల్లాల ఎస్పీలను యధాతధంగా ఉంచి 14 జిల్లాల ఎస్పీలకు స్థాన చలనం కలిగించింది. ఎస్పీల బదిలీల ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న ఏఆర్ దామోదర్ ను విజయనగరం జిల్లా ఎస్పీగా బదిలీ చేసింది. ప్రకాశం జిల్లాకు నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజును నియమించింది. 2013 ఐపిఎస్ బ్యాచ్కి చెందిన హర్షవర్ధన్ రాజు అన్నమయ్య జిల్లా మొదటి ఎస్పీగా పనిచేశారు అదేవిధంగా సిఐడి భాగంలోను తిరుపతి అర్బన్ ఎస్పీగాను విజయవాడ డిసిపి గాను పని చేశారు.