అనంతపురం నగరంలోని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసం వద్ద ఎన్టీఆర్ వైల్డ్ కింగ్స్ జండాలతో ఎన్టీఆర్ అభిమానులు నిరసనను నిర్వహించారు. ఏకంగా ఆయన ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున అలజడిని సృష్టించారు.