పత్రాలు ఇచ్చి నెలలు కావస్తున్నా యూరియా ఇస్తాలేరని నిరసిస్తూ రైతులు మంగళవారం వాంకిడి ప్రాధమిక సహకార సొసైటీ ఎదుట ధర్నా చేపట్టారు. రైతులు మాట్లాడుతూ...ముందు ఇచ్చి తమ పత్రాలను పక్కాన పెట్టి..! కొత్తవారికి యూరియా ఇస్తున్నారని ఆరోపించారు. యూరియా ఇవ్వకుండా తమ పత్రాలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ వ్యవసాయ పనులు వదులుకొని యూరియా కోసం ఇటూ షాపులో అటూ సహకార సొసైటీ కార్యాలయం ఎదుట ఉదయం నుంచి వేచి ఉంటున్నామని మండిపడ్డారు. ఎన్నిరోజులు యూరియా కోసం మీ కార్యాలయంలో చుట్టూ తిరగాలని అధికారులతో వాగ్వివాదానికి దిగారు.