ఎలమంచిలి నియోజకవర్గం వ్యాప్తంగా వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. రాంబిల్లి మండలం వెల్చూరుకు చెందిన ఆరుగురు, లాలకోడూరులో 12 మంది, కొప్పుగొండుపాలెంలో ముగ్గురు వాలంటీర్లు రాజీనామా చేసి, సంబంధిత లేఖలను ఎంపీడీవో వెంకటాచలంకు అందజేశారు. ఇప్పటికే పలు గ్రామాలకు చెందిన 56 మంది రాజీనామా చేయగా, తాజాగా మరో 21 మంది రాజీనామా చేశారు. అచ్యుతాపురం మండలంలోనూ వెదురువాడకు చెందిన 11 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.