మచిలీపట్నం లో రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా విద్యాసాగర్ నాయుడును నియమించింది. గతంలో ఇక్కడ ఎస్పీగా పనిచేసిన ఆర్. గంగాధరరావును బదిలీ చేశారు. ఎన్నికల సమయంలో గంగాధర్ రావు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.