అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు, పాఠశాలలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పీలేరు అర్బన్ సీఐ యుగంధర్ శనివారం సాయంత్రం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థుల పట్ల పాఠశాలలకు వెళ్ళే సమయంలో ఎవరైనా ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించిన, అనవసరంగా రాద్ధాంతం సృష్టించిన ఎంతటి వారినైనా సరే కఠిన చర్యలు తప్పవని పీలేరు అర్బన్ సీఐ యుగంధర్ హెచ్చరించారు.విద్యార్థినీ,విద్యార్థులు ధైర్యంగా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి పాఠశాలలో చదువుకొని తమ లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు.ఎవరిపైన, ఎలాంటి అనుమానాలు ఉన్న వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.