పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా బుధవారం మాచర్ల మండలం నాగులవరం గ్రామములో ఉన్న ఫ్లై టేక్ ఏవియేషన్ అకాడమిని సందర్శించారు.ఈ సందర్బంగా ఫ్లై టేక్ ఏవియేషన్ అకాడమి ( సాగర్ ఎయిర్ స్ట్రిప్) వివరాలను సంబందిత అకాడమి ఫౌండర్ కెప్టన్ మమతను అడిగి తెలుసుకున్నారు.అనంతరం నాగార్జున సాగర్ లోని అనుపు వద్ద బౌద్ధ విహారము కట్టడాలన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమములో జిల్లా రెవెన్యూ అధికారి మురళి, అకాడమి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.