రాయదుర్గం పట్టణంలోని ఓంశాంతి భవనంలో ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రాజయోగిని దాది ప్రకాశమణీజీ 18 వ పవిత్ర స్మృతి రోజున విశ్వ బంధుత్వ దినం సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి మద్యాహ్నం వరకూ జరిగిన రక్తదాన శిబిరంలో భక్తులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణ దాతలుగా ఎంతో ఆనందదాయకమని సంచాలకులు బికె యోగేశ్వరి తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ ప్రసాద్, మానవత రక్తదాతల సంస్థ వ్యవస్థాపకులు తరిమెల అమరనాథ్ రెడ్డి, శశాంత్, నారాయణ, శ్రీనివాసులు, జగదీష్, బ్రహ్మకుమారీలు పాల్గొన్నారు.