అందరి సహాయ సహకారాలతోనే...వెంకటగిరి పోలేరమ్మ జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించామని తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామక్రిష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక తెలుగుగంగ గెస్ట్ హౌస్ లో... టీడీపీ నేతలు, అధికారులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ... ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. జాతరలో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు.