నారాయణగూడలో టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం మధ్యాహ్నం భారీగా రద్దయిన పాత నోట్లోనూ పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంకు వద్ద ఇద్దరినీ వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి మూడు బ్యాగులను స్వాధీనం చేసుకొని మూడు బ్యాగుల లో ఉన్న 1000, 500 రూపాయల నోట్లోకట్లను సిజ్ చేశారు. ఈ నోట్ల కట్టల విలువ దాదాపు రెండు కోట్ల వరకు ఉంటుందని ఈ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.