వినాయక చవితి పండుగ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్య సిద్ధి మహాశక్తి గణపతి విగ్రహానికి ఎంపీ కేశినేని శివనాథ్ సతీసమేతంగా పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడి కరుణా, కటాక్షంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అన్ని అడ్డంకులు తొలగిపోయి, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.