తాడేపల్లిగూడెంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు 19 ఆంధ్ర బెటాలియన్ నేషనల్ క్యాండిడేట్ కార్ప్స్ రిపబ్లిక్ డే సెలక్షన్ క్యాంప్ నిర్వహించారు. పశ్చిమ, తూర్పు, కృష్ణా జిల్లాల నుంచి 299 మంది NCC క్యాడెట్లు హాజరయ్యారు. క్యాంపు కమాండెంట్ అమిత్, గ్రూప్ కమాండర్ రితిన్ మోహన్ అగర్వాల్, బల్విందర్ సింగ్ పర్యవేక్షణలో NCC క్యాడెట్ల ఎంపిక నిర్వహించారు. ఎంపికైన 46 మందిని ఢిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు పంపించనున్నట్లు వారు వివరించారు.