మాదిగల సంక్షేమ పథకాల పట్ల నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకోమని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో దామోదరం సంజీవయ్య భవన్ లో మాదిగ కార్పొరేషన్ చేర్మెన్ ఉండవల్లి శ్రీదేవి మాదిగల అభివృద్ధి పరిచే విదంగా సమావేశం ఏర్పాటు చేశారు.సాకే హరి మాదిగలకు జరుగుతున్న అన్యాయలను చేర్మెన్ కు వివరిస్తూ ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9626 మంది ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నారని నేటికీ వాటి సంగతి ఏమిటో తెలియదన్నారు.అలాగే చర్మ శుద్ధి కేంద్రాలు ఏర్పాటుచేసి నిరుద్యోగులను ఆదుకోవాలన్నారు.