నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుందని ప్రాజెక్టు అధికారులు గురువారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. భారీగా ఇన్ఫ్లో వస్తుండడంతో 18 గేట్లు ఐదు అడుగులు 8 గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి 2 లక్షల 249520 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 256453 క్యూసెక్కులు , అవుట్లో 2,96,522 క్యూసెక్కులు కాగా ప్రస్తుత నీటిమట్టం 585.40 అడుగులు చేరిందని, పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు తెలిపారు.