పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ శిధిల వ్యవస్థకు చేరుకున్న క్రమంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుగానే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హాస్టల్లోని విద్యార్థులను పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు తరలించినట్లుగా హాస్టల్ వార్డెన్ రవికుమార్ శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్లో ఉన్న ఒక బిల్డింగు బాగానే ఉందని ఆ బిల్డింగ్ లోకి కొంతమంది విద్యార్థులను పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలోకి మరి కొంతమంది విద్యార్థులను తరలించినట్లు పేర్కొన్నారు.