ఈనెల 30వ తేదీన మున్సిపల్ స్టేడియంలో జరిగే జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించిన సన్నాహకాలపై జనసేన పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ముఖ్య నేతలతో జగదాంబ వద్ద గల అంబికా బాగ్ కళ్యాణమండపం లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ విశాఖపట్నం రూరల్ అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ రమేష్ బాబు గారు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు సమావేశంకు సంబంధించిన పలు అంశాలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల నుంచి సూచనలు, సలహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు.