శ్రీకాళహస్తిలో యువకుడు మిస్సింగ్ శ్రీకాళహస్తిలోని టూ టౌన్ పరిధిలో షేక్ రఫీ (28) కనిపించడం లేదని సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు. సదరు యువకుడు వాహనాలు కొని అమ్మే బిజినెస్ చేస్తుంటాడన్నారు. ఇతను ఈనెల 5వ తేది రాత్రి నుంచి ఇంటి నుంచి వెళ్లిపోయి, తిరిగి రాలేదన్నారు. సమాచారం తెలిసిన వారు తమకు చెప్పాలని ఆయన కోరారు.