సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియంలో సోమవారం మండలస్థాయి క్రీడా పోటీలను మండల విద్యాధికారి విద్యాసాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తెలిపారు. వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.