రాయదుర్గం పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి ప్రాంగణంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 491 కేసులు పరిష్కారం అయినట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ఇన్చార్జి జడ్జి కె. బాను తెలియజేశారు. రాజీ మార్గం ద్వారా ఈ కేసులకు పరిష్కారం చూపినట్లు వెల్లడించారు. చిన్న చిన్న తగాదాలతో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు.