రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీతోనే ఉజ్వల భవిష్యత్తు అని, సీఎం చంద్రబాబు నాయుడు విజనరీ నచ్చడంతో పార్టీలో చేరుతున్నానని రిటైర్డ్ ఏఎస్ఐ గుడిపల్లి ఏడుకొండలు తెలిపారు. గురువారం సాయంత్రం నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కార్యాలయంలో గుడిపల్లి ఏడుకొండలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గుడిపల్లి ఏడుకొండలు మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని అభివృద్ధి చూస్తున్నామని తెలిపారు.