రామాయంపేట మండల వ్యాప్తంగా యూరియా కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ తెలిపారు క్లస్టర్ల వారిగా రైతులకు యూరియా సరఫరా చేస్తున్నామని రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రైతులు సహనం వహించాలని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి వస్తుందని ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు మూడు రోజులకు ఒక క్లస్టర్ చొప్పున యూరియా సరఫరా చేయడానికి ప్రణాళికలు రూపొందించడం జరిగిందని ఈరోజు రెండు క్లస్టర్ల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామని మరో రెండు రోజుల్లో మరో క్లస్టర్ తరఫున యూరియా సరఫరా చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దన్నారు