జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ట్రైబల్ వెల్ఫేర్, మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ తో కలసి శనివారం శ్రీకారం చుట్టారు. అరకువేలి తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ లబ్దిదారులకు ఉపయోగపడేవిధంగా కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు.