వినియోగదారుల హక్కుల పట్ల పూర్తిస్థాయిలో అవగాహన మరియు రక్షణ కల్పిస్తూ ఫిర్యాదుల సంస్కృతిని ప్రోత్సహించకుండా పూర్తిగా నియంత్రించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి మండలి సభ్యులకు సూచించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్ నందు జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సమావేశం సభ్యులతో నిర్వహించారు. ఈ ఆమె సందర్భంగా మాట్లాడుతూ.. వినియోగదారులు హక్కుల పరిరక్షణలో మండలి సభ్యులు కీలకంగా వ్యవహరించాలన్నారు.