చైతన్యపురి డివిజన్ పరిధిలోని దిల్సుఖ్నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద జరుగుతున్న వరద నీటి డ్రైయిన్ పనులను శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నపాటి వర్షానికి వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సమస్యను పరిష్కరించాలని డ్రెయిన్ లను విస్తరింప చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో వర్షపు నీరు నిల్వ ఉండదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.