దహెగం మండలంలోని పలు గ్రామాలలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విట్టల్ మునిగిన పంటలను పరిశీలించారు. మండలంలోని గిరవెల్లి, కర్జి, హత్తిని, చిన్న తిమ్మాపూర్ గ్రామాలలో మునిగిపోయిన పంటలను పరిశీలించి ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తామని రైతులకు తెలియజేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా జిల్లాలో పర్యటించినప్పుడు ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఎమ్మెల్సీ దండేవిటల్ అన్నారు,