శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండలో నగర పంచాయతీ కార్మికులు మంగళవారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. జీతాలు చెల్లించే వరకూ నిరసన కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి రమేశ్, మండల నాయకులు మల్లికార్జున, నగర పంచాయతీ కార్మికుల యూనియన్ నాయకులు కరణ్, మహేశ్, బావమ్మ తదితరులు పాల్గొన్నారు.