విశాఖపట్నం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ అంశంపై రగడ చోటు చేసుకుంది. "విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు" అని వైసీపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. శుక్రవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే వైసీపీ, సీపీఎ, సీపీఐ కార్పొరేటర్లు స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. "సేవ్ స్టీల్ ప్లాంట్" అంటూ నినాదాలతో వారు నిరసన తెలిపారు.