శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి RSKలో యూరియా పంపిణీ సాఫీగా కొనసాగుతోందని అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీవాణి బుధవారం మధ్యాహ్నం తెలిపారు. ఎనుములపల్లి, బీడుపల్లి గ్రామాలకు 560 యూరియా బ్యాగులు వచ్చాయన్నారు. భూ పాసుబుక్ ఆధారంగా 25 టన్నుల యూరియాను పంపిణీ చేస్తున్నామన్నారు. ఒక్కో బ్యాగు ధర ప్రభుత్వ సబ్సిడీ పోను రూ.266.50కు అందిస్తున్నట్లు తెలిపారు. స్టాక్ సఫిషియంట్ గా ఉందని, రైతులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.