చాగల్లు జడ్పీ హై స్కూల్ ను శనివారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సందర్శించారు.ఉపాధ్యాయుల అటెండెన్స్ రిజిస్టర్ ని పరిశీలంచి అనుమతి లేకుండా ఎ టీచర్ గైర్హాజరు కావదన్నారు.అనంతరం 10 వ తరగతి క్లాస్ రూమ్ లోకి వెళ్లి విద్యార్థులతో కలెక్టర్ పలు అంశాల మీద మాట్లాడారు.మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, పరిశుభ్రంగా వంట తయారీ ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు.క్లాస్ లు ఎలా జరుగుతున్నాయి,ఎ విద్యార్థి ఎ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నారు,అలాంటి వారిపైన టీచర్ లు ఎలా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు అని కలెక్టర్ అడిగారు.ఫైనల్ ఎగ్జామ్స్ కి ఇప్పటి నుండే ఒక ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు.