రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ ఏడీఏ అపర్ణ సూచించారు. గురువారం కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలోని సొసైటీని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ రైతులకు పంపిణీ చేస్తున్న యూరియాను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులకు యూరియా సరఫరాలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినట్లు తెలిపారు. ఇక నుంచి అలాంటి సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.