జిల్లాలో యూరియా కేటాయింపును పారదర్శకంగా నిర్వహించేందుకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. మంగళవారం రాజమండ్రి లోని జిల్లా కలెక్టరేట్ వద్ద సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కమిటీలో వ్యవసాయ, సహకార, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు మార్క్ఫెడ్ డిఎం సభ్యులుగా ఉంటారని తెలిపారు.