శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలోని ఇందిరానగర్ కు చెందిన చేనేత కార్మికుడు చింతా రవిచంద్ర, రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ చిత్రంతో కూడిన పట్టుచీరను 75 రోజుల పాటు కష్టపడి నేశాడు. సుమారు రూ. 2.5 లక్షల ఖర్చుతో తయారు చేసిన ఈ చీరను మంత్రిపై అభిమానంతో రూపొందించినట్లు రవిచంద్ర తెలిపారు. మంగళవారం సాయంత్రం రవిచంద్ర మాట్లాడుతూ చేనేత పరిశ్రమను ఆదుకోవాలని, సత్యసాయి జిల్లా చేనేత కార్మికులకు క్లస్టర్లు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని, రేషం పై సబ్సిడీలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తోటి కార్మికులు రవిచంద్రను అభినందిస్తున్న